- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఏపీకి మంత్రి కోమటి రెడ్డి.. పవన్‌ను కలుస్తారా?
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నేడు ఏపీకి వెళ్లనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అయితే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోనసీమకు తెలంగాణ

దిశ, వెబ్ డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నేడు ఏపీకి వెళ్లనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అయితే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ కౌంటర్లు ఇచ్చారు. అందులో కోమటిరెడ్డి కూడా ఉన్నారు.
పవన్ సినిమాలను తెలంగాణలోనే విడుదల కానివ్వను అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను కోమటిరెడ్డి కలుస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పెద్దలను తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఆహ్వానించారు. ఈ సమ్మిట్ లో ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ప్రభుత్వం ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.






