బీసీల గొంతు కోస్తారా.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్

by Kema Shiva Kumar |

ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) బీసీ (BC) కాదని.. ఆయన ఓ కన్వర్టెడ్ ఓబీసీ (OBC) అంటూ గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

బీసీల గొంతు కోస్తారా.. సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) బీసీ (BC) కాదని.. ఆయన ఓ కన్వర్టెడ్ ఓబీసీ (OBC) అంటూ గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ (RSS) కుల గణనకు తీవ్ర వ్యతిరేకమని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ (Congres Party) కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా అధికారంలోకి వస్తే.. బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం డిక్లరేషన్ అమలు హామీ ఇచ్చిందని అన్నారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఇప్పటికీ ఆ విషయంలో రేవంత్ సర్కార్‌కు క్లారిటీ లేదన్నారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు బీసీ-ఈ కింద 4 శాతం రిజర్వేషన్లు కల్పించనప్పుడు హైకోర్టు ధర్మాసనం ఆ రిజర్వేషన్లు చెల్లవని రెండు సార్లు తీర్పును ఇచ్చిందని కిషన్ రెడ్డి గర్తు చేశారు. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఆ తీర్పుపై స్టే తీసుకొచ్చి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని తెలిపారు. అది సరిపోదు అన్నట్లుగా ఇప్పుడు ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దీంతో స్థానిక సంస్థలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలతో పాటు ముస్లింలకు పోటీ చేసే అవకాశం లభిస్తుందని, ఇది బీసీల గొంతు కోయడమేనని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జాబితా నుంచి ముస్లింలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై గోబెల్ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మంత్రివర్గంలో బీసీలకు ఎలాంటి ప్రాధన్యత ఇచ్చారో జనం చూశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఓ బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేయాలని కామెంట్ చేశఆరు. కానీ, కేంద్ర ప్రభుత్వం బీసీలకు పెద్ద పీట వేస్తుందని.. మంత్రులుగా అత్యధికంగా బీసీలే ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీని పట్టుకుని కన్వర్టెడ్ బీసీ అన్న వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story