- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీహెచ్ సంచలన నిర్ణయం.. ఈ నెల 9 నుంచి ఆమరణ నిరాహార దీక్ష
by Prasad Jukanti |
బీసీ కుల గణనపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 9న ఆమరణ దీక్షకు దిగనున్నట్లు వీహెచ్ వెల్లడించారు. ప్రధాని మోడీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: బీసీ క్యాస్ట్ సెన్సెస్ పై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ నెల 9 వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నట్లు ప్రభుత్వ సలహాదారు, వి.హనుమంత్ రావు తెలిపారు. బీసీ క్యాస్ట్ సెన్సెస్‍పై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఈ దీక్ష కొనసాగుతుందన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన 8వ తేదీ లోపు ఈ అంశంపై స్పష్టత ఇచ్చాకే 10వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు రావాలన్నారు. ఓసీ అయిన రాహుల్ గాంధీ తెలంగాణలో బీసీ క్యాస్ట్ సెన్సెస్ చేశారని మరి బీసీ అని చెప్పుకునే మోడీ బీసీలపై వివక్ష చూపించడం ఎందుకు అని ప్రశ్నించారు. మోడీ హయాంలో రేట్లు పెరిగి అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని విమర్శించారు.
Next Story






