- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరువుతా: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పెట్టుబడులకు హైదరాబాద్‍లో మంచి అవకాశాలు ఉన్నాయని పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‍కు (Telangana Rising Global Summit)తానూ హాజరవుతానని చెప్పారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన కిషన్ రెడ్డి.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలనేది మా ఆకాంక్ష అన్నారు. కాగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాట ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో మెగా ఈవెంట్ ను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తోంది. 2047 టార్గెట్‍గా తెలంగాణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ రోడ్ మ్యాప్‍ను సిద్ధం చేసుకుంది. 22 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలి? ఎలా ఉండబోతోంది అనే అంశంపై విజన్ డాక్యుమెంట్ ను ఈ ఈవెంట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వం విడుదల చేయబోయే విజన్ డాక్యుమెంట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.






