గోదావరి నదిపై WII రిపోర్ట్ వచ్చేసింది.. విదేశీ చేపలు, ఇసుక తవ్వకాలపై నిపుణుల ఆందోళన

by Ramesh Naini |

గోదావరి నదిపై వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) ఆధ్వర్యంలో పర్యావరణ అధ్యయనం జరిగింది.

గోదావరి నదిపై WII రిపోర్ట్ వచ్చేసింది.. విదేశీ చేపలు, ఇసుక తవ్వకాలపై నిపుణుల ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ భారతదేశంలోని నదుల పర్యావరణ పరిస్థితులను అంచనా వేసి వాటి సంరక్షణ కోసం సరైన ప్రణాళికలు అమలు చేయడానికి మొత్తం 7 నదులను ఎంపిక చేసింది. గోదావరి నదిపై వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) ఆధ్వర్యంలో పర్యావరణ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయన పరిస్థితులపై అటవీ దళాల ప్రధాన సంరక్షిణాధికారిణి డాక్టర్ సువర్ణ అధ్యక్షతన, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా డీన్ డాక్టర్ రుచీ బదోలా ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం Work shop నిర్వహించారు. సమావేశంలో రుచి బదోలా మాట్లాడుతూ.. గోదావరి పరివాహక ప్రాంతాన్ని మూడు భాగాలుగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. (Upper Godavari - మహారాష్ట్ర, Mid Godavari - తెలంగాణ, Lower Godavari - ఆంధ్రప్రదేశ్) అని విరించారు. మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో గోదావరి తక్కువ కాలుష్యానికి గురైందని పేర్కొన్నారు. అయితే ఇసుక క్వారీల నియంత్రణ సరైన విధంగా అమలు కావడంలేదని, మితిమీరిన ఇసుక తవ్వకాల వల్ల భవిష్యత్తులో ఆనకట్టలు, వంతెనలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

అలాగే, నదీ జలాల పక్కన నీటిని శుద్ధి చేసి చెట్లు, గడ్డి జాతుల మొక్కలు నాటాలని సూచించారు. సుమారు 25 ఏళ్ల క్రితం భారత్‌లోని నదులు, చెరువుల్లో విదేశీ జాతుల చేప పిల్లలను (ప్రధానంగా ఆఫ్రికన్ జాతి) విడిచారని, ప్రస్తుతం అవి స్థానిక భారతీయ చేపల కంటే ఎక్కువగా విస్తరించినట్లు గుర్తించామని అన్నారు. ముఖ్యంగా కార్ప్ (CARP), టిలాపియా (TILAPIA) అనే చేపలు దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.

వలల వాడకం విషయంలో కూడా ప్రత్యేక దృష్టి అవసరమని నిపుణులు సూచించారు. చిన్నపల్ల చేపలను కూడా పట్టే విధంగా వలలను ఉపయోగించడం వల్ల స్థానిక జాతుల పెంపకం దెబ్బతింటుందని, ఇది భవిష్యత్తులో చేపల జనాభా తగ్గిపోవడానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అందువల్ల మత్స్యకారులు శాస్త్రీయ పద్ధతిలో వలలను వాడాలని, చిన్న చేపలకు పెరుగుదలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని పర్యావరణ పరిస్థితులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా మాత్రమే నది జీవవ్యవస్థను కాపాడగలమని, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమన్వయం చేసుకొని సంరక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో Zoological serve of India నుంచి పాండి, PCB నుంచి Dr. ప్రసాద్, గోదావరి రివర్ మేనేజింగ్ బోర్డ్ మెంబెర్(టెక్నికల్) అరగేషన్ (Azhagesan), CCMB చీఫ్ సైంటిస్ట్ Dr ఉమాపతి, CCMB ప్రిన్సిపల్ సైంటిస్ట్ Dr కార్తికేయన్, బయో డైవర్సిటీ నుంచి శిల్పి శర్మ హాజరయ్యారు.

Next Story