అలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు.. బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్

by Ramesh Goud |

రంగరాజన్ పై దాడికి పాల్పడిన వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (BRS Leader Enugula Rakesh Reddy) ప్రశ్నించారు.

అలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు.. బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రంగరాజన్ పై దాడికి పాల్పడిన వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి (BRS Leader Enugula Rakesh Reddy) ప్రశ్నించారు. చిలకూరు బాలాజీ ప్రధాన పూజారి (Chilkur Bhalaji Priest)పై కొందరు మూకలు దాడి చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాకేష్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ఫైర్ (Fire) అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. దాడికి సంబంధించిన వీడియో (Video)ను పోస్ట్ (Post) చేశారు. దీనిపై.. చిలుకూరు బాలాజీ దేవాలయం (Chilkur Bhalaji Temple) అర్చకులు రంగరాజన్ పై కొంతమంది ఉన్మాదులు దాడి చేయడం హిందువులందరినీ కలచివేసిందని అన్నారు.

రంగరాజన్ గత అనేక ఏళ్లుగా ఇటు నిత్యం చిలుకూరు బాలాజీ సేవలో ఉంటూనే ఇంకోవైపు తన ప్రవచనాల ద్వారా సనాతన ధర్మంలోని విశిష్టతను, ఔనత్యాన్ని, ప్రత్యేకతను చాటుతూ ధర్మ మార్గాన్ని బోధిస్తూ వస్తున్నారని తెలిపారు. హిందూ దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వాల పెత్తనమేంటి అని గట్టిగా ప్రశ్నించి, దేవాలయాల స్వతంత్రతపై హిందువుల్లో చైతన్యాన్ని నింపారని గుర్తు చేశారు. అంతేగాక అంటరానితనానికి హిందూ ధర్మంలో స్థానం లేదని మాటల్లో కాకుండా చేతల్లో చూపారని తెలిపారు. అలాంటి వేద పండితుని పై ఇలా మిడి మిడి జ్ఞ్యానంతో, అహంకారంతో విర్రవీగుతూ దాడి చేయడం, వారిని శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి చేయడం దుర్మార్గమని, క్షమించరాని నేరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక సనాతన ధర్మ సారాన్ని సరళమైన భాషలో తమ ప్రవచనాల ద్వారా ప్రజలకు చేరవేస్తున్న చిలుకూరు రంగరాజన్ లాంటి ప్రవచనకర్తలకు, వేద పండితులకు తగిన భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అని, దాడి చేసిన వారి పై ఇప్పటి వరకు ఎందుకు చర్య తీసుకోలేదు? అని నిలదీశారు. ఇగనైనా ఈ దాడికి పాల్పడిన మూర్ఖులపై వెంటనే కఠినమైన చర్య (Strict Action) తీసుకోవాలని, రంగ రాజన్ లాంటి వారికి ప్రభుత్వమే తగిన భద్రత కల్పించాలని బీఆర్ఎస్ నేత డిమాండ్ (Demand) చేశారు. కాగా కొద్ది రోజుల క్రితం చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆయన కుమారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆయనపై కూడా దాడి చేశారు. ఈ దాడిపై రంగరాజన్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Next Story