ఉద్యమకారులను దేశభక్తులతో పోలిస్తే వివాదం ఎందుకు? తేజస్వి వివాదంపై బండి సంజయ్ స్పందన

by Ramesh Naini |

ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వివాదం చేయడమేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

ఉద్యమకారులను దేశభక్తులతో పోలిస్తే వివాదం ఎందుకు? తేజస్వి వివాదంపై బండి సంజయ్ స్పందన
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దేశ విభజన అంశాన్ని ప్రస్తావిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వివాదం చేయడమేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్​నేత సోనియాగాంధీని బలి దేవత అంటూ చేసిన విమర్శలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేబినెట్ లో మీరెలా మంత్రులుగా ఉన్నారని నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై దేశమంతా ఎదురు చూస్తోందని, బీజేపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందనే భయంతోనే ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలకు తెరదీశారని విమర్శించారు. ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలతో వందలాది మంది తెలంగాణ యువకులు బలిదానం చేశారని చెబుతూ దేశ విభజన అంశాన్ని ప్రస్తావించారే తప్ప ఆయన తెలంగాణను అవమానించ లేదన్నారు. దేశ విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలతో లక్షల మంది చనిపోయారని, తెలంగాణ కోసం 1400 మంది యువకులు బలిదానమైయ్యారని ఆవేదన చెందారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి సీమాంధ్ర నేతల ఒత్తిడితో యూ టర్న్ తీసుకుందన్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు కాలయాపన చేసిందని, ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ప్రకటనలతో యువకులు ప్రాణత్యాగం చేశారని అన్నారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు.

రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్లు అప్పు

తెలంగాణ ఉద్యమకారులను దేశభక్తులుగా చెబుతూ కాంగ్రెస్ వ్యవహరించిన తీరువల్లే వారు చనిపోయారని తేజస్వీ చెబితే దానిని కూడా వక్రీకరించడం సరికాదన్నారు. గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అవినీతి బయటకు రాకుండా బీఆర్ఎస్ నేతలు రోజుకో అంశాన్ని వివాదం చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమోదం పొందబోతున్న ఈ అద్భుత ఘడియలను దేశ ప్రజలంతా ఆస్వాదిస్తుంటే చూస్తూ ఓర్వ లేకపోతున్నారు. స్వరాష్ట్ర వస్తే కేసీఆర్, రేవంత్ కుటుంబమే లాభపడ్డదని, తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేస్తే రేవంత్ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజల చేతికి చిప్ప ఇచ్చిందని ఆరోపించారు.

Next Story