దళితుల భూములపై దండయాత్ర ఎందుకు.. ప్రభుత్వానికి హరీశ్ రావు సూటి ప్రశ్న

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 08:16:59  IST  )

వికారాబాద్ జిల్లా పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం జరుగుతున్న భూసేకరణపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుల భూములపై దండయాత్ర ఎందుకు.. ప్రభుత్వానికి హరీశ్ రావు సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: దళితులు, పేద వర్గాల భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దండయాత్ర చేస్తోందో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పరిగి (Parigi) నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయన బయటకు రాకుండా అన్ని మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన వికారాబాద్, భువనగిరిలలో ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు ఉంటే, అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని విమర్శించారు.

మహిళలను అరెస్ట్ చేయడం ప్రజా పాలనా?

ప్రజాస్వామ్యం, ప్రశ్నించే హక్కు అని మాట్లాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న కళ్లాపూర్ వద్ద టెంట్లను పీకేయడం, మహిళలను అరెస్టు చేయడం ‘ప్రజాపాలన’ కాదని, ఇది ‘భక్షక పాలన’ హరీశ్ రావు ధ్వజమెత్తారు. నాడు ఇందిరమ్మ పంపిణీ చేసిన భూములను, నేటి ఇందిరమ్మ పాలనలో గద్దల్లా వాలి లాక్కోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కేవలం భూముల చుట్టూనే తిరుగుతున్నాయని, మూసీ, హైడ్రా, లగచర్ల నుంచి పరిగి వరకు పేదల ఇళ్లు, భూములపైనే దాడులు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూములను వదిలేసి, పేదల పొట్ట కొట్టి సాగు భూములను సేకరించడం వెనుక భారీ కుట్ర ఉందని విమర్శించారు. 22A నిషేధిత జాబితాను తక్షణమే రివ్యూ చేసి ఎత్తివేయాలని, ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని రైతులకు భూములు తిరిగి ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాకు సీఎం, స్పీకర్ ఉన్నా, అది జిల్లాకు శాపంగా మారిందని, ఎస్సీ, ఎస్టీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ (SC), ఎస్టీ (ST)లకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని, ఒకవేళ ప్రాజెక్టుల కోసం భూములను సేకరిస్తే పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ నేడు అందుకు విరుద్ధంగా, ఎకరాకు కోటి రూపాయల విలువ ఉన్న భూమిని కేవలం రూ.10 లక్షలకో, రూ.20 లక్షలకో గుంజుకుంటున్నారని ఆరోపించారు. ‘పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతులు భూములు కోల్పోతున్నారు. తాము భూములు ఇవ్వలేమని వారు కన్నీరుమున్నీరవుతున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులు తనను అడ్డుకోలేరని, ఖచ్చితంగా పరిగి వెళ్లి తీరుతానని హరీశ్ రావు స్పష్టం చేశారు.

కచ్చితంగా పరిగి వెళ్లి తీరుతా..

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ (SC), ఎస్టీ (ST)లకు భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని, ఒకవేళ ప్రాజెక్టుల కోసం భూములను సేకరిస్తే పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ నేడు అందుకు విరుద్ధంగా, ఎకరాకు కోటి రూపాయల విలువ ఉన్న భూమిని కేవలం రూ.10 లక్షలకో, రూ.20 లక్షలకో గుంజుకుంటున్నారని ఆరోపించారు. ‘పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతులు భూములు కోల్పోతున్నారు. తాము భూములు ఇవ్వలేమని వారు కన్నీరుమున్నీరవుతుంటే, అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి భక్షకుడిలా మారారు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసులు తనను అడ్డుకోలేరని, ఖచ్చితంగా పరిగి వెళ్లి తీరుతానని హరీశ్ రావు స్పష్టం చేశారు.

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పరిగి పర్యటనకు బ్రేక్!

Next Story