న్యూయార్క్ లాగా కంచ గచ్చిబౌలి భూములను ఎందుకు చూడకూడదు.. లడఖ్ సామాజిక కార్యకర్త ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |

రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న కంచ గచ్చిబౌలి భూములపై (Kancha Gachibowli lands) లడఖ్ (Ladakh)కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త (social activist), విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

న్యూయార్క్ లాగా కంచ గచ్చిబౌలి భూములను ఎందుకు చూడకూడదు.. లడఖ్ సామాజిక కార్యకర్త ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న కంచ గచ్చిబౌలి భూములపై (Kancha Gachibowli lands) లడఖ్ (Ladakh)కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త (social activist), విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. న్యూయార్స్ నగరం (New York City) సెంట్రల్ పార్క్ (Central Park)ను ఉంచినప్పుడు హైదరాబాద్ లో కంచ గచ్చిబౌలి భూములను ఎందుకు ఉంచకూడదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అభివృద్ధి పేరుతో ప్రకృతి నాశనం అవుతుండగా.. ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేకుండా విదేశాల్లోని ప్రధాన నగరాలు ప్రకృతిని చెక్కుచెదరకుండా ఉండేలా కాపాడుకుంటున్నాయని తెలిపారు.

"రియల్ ఎస్టేట్ పరంగా మాన్‌హట్టన్ (Manhattan) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం (most expensive place)అని, ఇక్కడ 1 చదరపు అడుగు ధర రూ. 3 లక్షలు ఉంటుందని చెప్పారు. నగర మేయర్ తలుచుకుంటే సెంట్రల్ పార్క్ ప్రాంతంలో షాపింగ్ మాల్, మెట్రో లాంటివి నిర్మించి ఉండేవాడు. కానీ వారు ప్రకృతిని గౌరవిస్తున్నారని తెలిపారు. అలాగే న్యూయార్క్ లాగా భారతదేశంలో ప్రకృతిని ఎందుకు గౌరవించలేకపోతున్నామని అడిగారు. “హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి, పూణేలోని రివర్ ఫ్రంట్ (Riverfront in Pune), ముంబైలోని ఆరే అడవి (Aarey Forest in Mumbai)ని నగరానికి ఊపిరితిత్తులుగా ఎందుకు భావించకూడదు!” అని వాంగ్‌చుక్ ప్రశ్నించారు.

అంతేగాక “మన దేశానికి ఊపిరితిత్తులు (lungs of our country)గా భావించే హిమాలయాల (Himalayas)ను శివుని పవిత్ర నివాసంగా ఎందుకు వదిలివేయకూడదు అంటూ.. తద్వారా ప్రకృతి మనకు స్వచ్ఛమైన గాలి, నీటిని అందింస్తుంది?” అని తెలిపారు. కాగా హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ ఉన్న కొన్ని జీవజాతులకు ఇబ్బంది కలుగుతోందని కొందరు వ్యక్తులు ఫేక్ వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నదని సామాజిక కార్యకర్తలు, ఇన్విరాన్‌మెంటలిస్టులు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ క్రమంలోనే లడఖ్ కు చెందిన సామాజిక కార్యకర్త వాంగ్ చుక్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ ప్రకృతి ప్రేమికులను ఆలోచింపజేస్తున్నాయి.

Next Story