లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ ఎందుకు చేయలేదు: సీపీఐ నారాయణ

by Disha Web Desk 12 |
లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ ఎందుకు చేయలేదు: సీపీఐ నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవితను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. బుధవారం ముగ్దుం భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వారికి ఒకలా వ్యతిరేకించే వారిని మరోలా వ్యవస్థ ఈడి వంటి సమస్యలతో దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.

లిక్కర్ స్కామ్‌లో సంబంధం ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఆ పార్టీలలోని ఒక నాయకుని అరెస్టు చేయకుండా కేవలం ఢిల్లీ ప్రభుత్వంలోని సిపొడియను అరెస్టు చేయడానికి ఆయన తప్పు పట్టారు. బీజేపీ గౌతమ్ తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారిని అరెస్టు చేయకపోవడం ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలన్నారు. 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఎవరిని అరెస్టు చేయలేదన్నారు.

ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎం, బిఆర్ఎస్ ఓకే చెట్టు కొమ్మలని అన్నారు. తమకు చెన్నూరు, కొత్తగూడెం స్థానాలను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుదలపై ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా ప్రభుత్వాన్ని నిర్లక్ష్యమని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఒకసారి విద్రోహక చర్య మరోసారి సాంకేతికమైన తప్పు ఉంటుందన్న వ్యాఖ్యలు బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రెండు స్టేట్మెంట్లను ఎస్పీ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రాజెక్టులో జరిగిన లోపాలను గుర్తించడానికి తమ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సందర్శిస్తామని ఆయన తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని , నీతి నియమాలను న్యాయ కోవిదుల సూచనలు అన్నిటినీ తుంగలో తొక్కి అడ్డదారిన అధికారంలోకి రావాలని చేస్తోందని ఆరోపించారు. కులం మతం పేరిట రెచ్చగొట్టి ప్రజల మధ్య వైశ్యమ్యాలు సృష్టిస్తున్నారని ఒకసారి సనాతన ధర్మం అంటూ దేశవ్యాప్తంగా సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని ఓడించేందుకు సిపిఐ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed