ఆపరేషన్ ‘కగార్’‌పై అంత కంగారెందుకు.. కేసీఆర్‌పై రఘునందన్ హాట్ సెటైర్లు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-28 05:00:12  IST  )

ఎల్కతుర్కి‌లో జరిగిన రజతోత్సవ సభలో కేసీఆర్ (KCR) ప్రసంగంపై మెదక్ ఎంపీ రఘునందర్ రావు (MP Raghunandan Rao) హాట్ సెటైర్లు వేశారు.

ఆపరేషన్ ‘కగార్’‌పై అంత కంగారెందుకు.. కేసీఆర్‌పై రఘునందన్ హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎల్కతుర్కి‌లో జరిగిన రజతోత్సవ సభలో కేసీఆర్ (KCR) ప్రసంగంపై మెదక్ ఎంపీ రఘునందర్ రావు (MP Raghunandan Rao) హాట్ సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) ప్రసంగంలో ఏమాత్రం కొత్తదనం లేదని కామెంట్ చేశారు. ఇటీవల పలు కార్యక్రమాల్లో కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) మాట్లాడిన మాటలే ఆయన మాట్లాడారని అన్నారు. కేసీఆర్ (KCR) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ స్పీచ్ (Political Speech) చూసి చదివారంటూ సెటైర్లు వేశారు. అరిగిపోయిన రికార్డే మళ్లీ కేసీఆర్ (KCR) వేశారని ఎద్దేవా చేశారు. ‘ఆపరేషన్ కగార్’‌ (Operation Kagaar)పై అంత కంగారు ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మావోయిస్టుల (Maoists)ను పావుగా వాడుకోవాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. న్యూ డెమోక్రసీ ర్యాలీ (New Democracy Rally), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పీఎస్ కమిటీ చర్చలు, కేసీఆర్ డిమాండ్ అన్నీ ఒక్కరోజులోనే జరిగాయని ఇదేం చిత్రమో అర్థం కావడం లేదని అన్నారు. అధికారంలో ఉన్న నాడు ఇదే గులాబీ నేతకు మావోయిస్టులు గుర్తుకు రాలేదని.. అధికారం పోగానే గుర్తుకొచ్చారా..? అంటూ ప్రశ్నించారు. నేటికీ నేషనల్ హైవేస్‌లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని.. ఇది ఎవరి ఘనత? కేంద్రం నిధులతో రోడ్లు వేయలేదా అని అన్నారు. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ట్రై జంక్షన్‌కు రూ.1,600 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ఫైర్ అయ్యారు. కొత్త మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలా.. లేని రాష్ట్రాలకా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులే ఇవ్వకపోతే గజ్వేల్, సిద్దిపేటకు రైల్వే లైన్లు ఎలా వచ్చాయంటూ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు.

కాగా, ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ (BJP) వైఖరి భబ్రాజమానం.. భజగోవిందం, శుష్కప్రియాలు.. శూన్యహస్తలంటూ సెటైర్లు వేశారు. 11 ఏళ్లు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ (BJP Government) ఏనాడు తెలంగాణ (Telangana) రాష్ట్రానికి అదనంగా నిధులు ఇచ్చిన పాపాన పోలేదని కామెంట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagaar) పేరుతో అక్కడున్న గిరిజనులు, యువతను ఊచకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చలకు తాము సిద్ధమేనంటూ మావోయిస్టులు (Maoists) కోరుతున్నారని.. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని వెంటనే వారిని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపుతామని కేసీఆర్ అన్నారు.

Next Story