బీఆర్ఎస్ దీక్షకు రేవంత్ కి ఎందుకు వణుకు.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

by Ramesh Goud |

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(BRS Leader Jagadeesh Reddy) వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ దీక్షకు రేవంత్ కి ఎందుకు వణుకు.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(BRS Leader Jagadeesh Reddy) వ్యాఖ్యానించారు. నల్గొండ(Nalgonda) రైతు మహా ధర్నాకు(Raithu Maha Dharna) కాంగ్రెస్ సర్కార్ అనుమతి నిరాకరరించడం పట్ల మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం లేదని, పరిపాలన చేయడం చేతగాక నిరసనలు వ్యక్తం చేస్తామంటే అనుమతి నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పని చేయటం పార్టీల హక్కు అని, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఏ కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆగ్రహించారు.

అలాగే మా నాయకుడు కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం, రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు పుడుతుందో అర్ధం కావడం లేదన్నారు. ఇక రైతులను మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే రేపు నల్గొండలో సభ నిర్వహిస్తామంటే ఈరోజు పోలీసులు అనుమతి నిరాకరించారని తెలియజేశారు. రైతు భరోసా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కృష్ణ, గోదావరిలో నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నదని విమర్శలు చేశారు. ఇక కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా శాంతియుతంగానే ప్రజలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత అడ్డుకున్న రేపటి దీక్ష కొనసాగుతుందని, ఇది మా హక్కు అని బీఆర్ఎస్ నేత వెల్లడించారు.

Next Story