- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రైతులను కొట్టించినప్పుడు ఎందుకు స్పందించలేదు’
by Sathputhe Rajesh |
షర్మిలను రిమాండ్‌కు తరలించడంపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ స్పందించారు. పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలను అరెస్ట్ చేయగానే విజయమ్మ తల్లడిల్లింది అని వ్యాఖ్యానించారు. అమరావతి మహిళలు న్యాయం చేయాలని రోడ్డెక్కితే.. జగన్ పోలీసులతో కొట్టించినప్పుడు విజయమ్మ ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు. అమరావతి మహిళలను పోలీసులు బూటు కాళ్లతో పొత్తి కడుపులో తన్నించినప్పుడు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. అమరావతి మహిళల వస్త్రధారణపై వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.
Next Story






