- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు బూతులు పరిచయం చేసింది ఎవరు? : వాకిటి శ్రీహరి
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) విపక్షాలకు హితవు పలికారు.

దిశ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని జగదీష్ రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) హితవు పలికారు. ఉనికి కోల్పోతామనే భయంతో ఆయన కావాలనే విషం కక్కుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో సంస్కారహీనమైన పదజాలం ఉపయోగించడం తగదని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు బూతులు పరిచయం చేసింది ఎవరో ఒకసారి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. పచ్చ కామెర్ల వారికి అంతా పచ్చగానే కనిపించినట్టు, ప్రతిపక్షాలకు అన్నీ తప్పులే కనిపిస్తాయని అన్నారు. గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు అసభ్యకరమైన భాషను వినియోగించి తిట్టినపుడు ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు.
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విమర్శించడం కంటే, సానుకూల విమర్శలతో సహకరించాలని ఆయన ప్రతిపక్ష నాయకులకు సూచించారు. ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు, గురుకుల విద్య, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి పథకాల ద్వారా సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వీటిని వ్యతిరేకించడం ద్వారా తెలంగాణ పురోగతికి ఆటంకం కలిగిస్తున్నారని వాకిటి శ్రీహరి మండిపడ్డారు.






