- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజేలు, బ్యాండ్లు వద్దనడానికి పోలీసులు ఎవరు : ఎమ్మెల్యే రాజాసింగ్
హిందూ పండుగలకు పోలీసులు అడ్డగోలు ఆంక్షలు విధించి భక్తులను ఇబ్బందులు పెట్టడం సరికాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : హిందూ పండుగలకు పోలీసులు అడ్డగోలు ఆంక్షలు విధించి భక్తులను ఇబ్బందులు పెట్టడం సరికాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పండుగలు ఏ విధంగా జరుపుకోవాలో చెప్పడానికి పోలీసులు ఎవరంటూ పోలీస్ కమిషనర్, డీజీపీని ప్రశ్నించారు. ఏదైనా హిందూ పండుగ వస్తే చాలు, పోలీసులు డీజేలు పెట్టొద్దు, బ్యాండ్ పెట్టొద్దు బెదిరింపులు చేస్తారని, మా పండుగలు ఎలా చేసుకోవాలో మీరే నిర్ణయిస్తారా అని పోలీసు ఉన్నతాధికారులపై మండిపడ్డారు. హనుమాన్ జయంతికి కూడా ఇదే తరహా ఆంక్షలు విధిస్తారని గుర్తుచేశారు.
గణేశ్ కమిటీ నిర్వాహకులు పోలీసుల మాటలు నమ్మవద్దని ఏడాదికి ఒకసారి వచ్చే గణేశ్ నిమజ్జనం రోజున డీజేలు, బ్యాండ్లు పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదవన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా డీజేలు ఏర్పాటు చేసుకుని అసభ్యకర పాటలు కాకుండా దేవుని భక్తి పాటలు పెట్టాలని సూచించారు. గణేశ్ ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ శాఖ అధికారులు ఎంతో సహకరిస్తున్నారని పేర్కొంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.






