- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే వైట్ రేషన్ కార్డు తప్పనిసరి!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఇటీవల ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వంపై భారీ ఎత్తున నిరసన ప్రకటించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఇటీవల ఉన్నత విద్యా సంస్థలు ప్రభుత్వంపై భారీ ఎత్తున నిరసన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెండింగ్ బకాయిల విడుదలకు ప్రభుత్వం సమ్మతం తెలపగా.. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తమ నిరసనను విరమించారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ పొందడానికి ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ పొందేవారిలో పేద విద్యార్థులతోపాటు ఆర్థికంగా ఉన్నత కుటుంబాల వారు, ఉద్యోగస్తుల పిల్లలు కూడా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
నకిలీ ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. వైట్ రేషన్ కార్డుకు అర్హులు కాని వారికి మీసేవ కేంద్రాల్లో మిస్సింగ్ రేషన్ కార్డు అని చూపిస్తుంది. దీంతో అనర్హులను సులభంగా గుర్తించి, వారిని తొలగించి మిగిలిన వారికి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది.






