టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ!

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-09 10:08:54.0  )
టిఫిన్ తినేందుకు వెళ్తే.. రూ.23 లక్షలు చోరీ!
X

దిశ, వెబ్ డెస్క్: బస్సు ప్రయాణం మధ్యలో టిఫిన్ తినేందుకు వెళ్లిన ప్రయాణికుడికి చెందిన రూ.23లక్షలు చోరీ చేసిన ఘటన సంచలనంగా మారింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఈ చోరీ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సును బస్సు డ్రైవర్ ప్రయాణికులు టిఫిన్ చేసేందుకు నార్కట్ పల్లి వద్ధ ఓ హోటల్ ముందు ఆపాడు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న బాపట్ల వాసి వెంకటేష్ కూడా తన వెంట ఉన్న రూ.23లక్షల బ్యాగ్ ను బస్సులోనే పెట్టి టిఫిన్ చేసేందుకు హోటల్ కు వెళ్లాడు.

టిఫిన్ చేసిన వెంకటేష్ తిరిగి బస్సు ఎక్కి చూస్తే తన డబ్బులతో కూడిన బ్యాగ్ కనిపించలేదు. దీంతో లబోదిబోమన్న వెంకటేష్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా సీసీ కెమెరా ఆధారాలతో వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పలు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరాలో చూస్తే బస్సు లో చివరగా దిగిన ఓ వ్యక్తి డబ్బుల బ్యాగ్ ను వీపుకు వేసుకుని నడుచుకుంటూ రహదారివైపు వెలుతున్న దృశ్యం కనిపించింది. దీంతో పోలీసులు ముందుగా బస్సు ప్రయాణికుల వివరాలను విచారిస్తున్నారు.

Next Story

Most Viewed