TG ICET-2025 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-06 10:03:49  IST  )

తెలంగాణ(Telangana)లో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే TG ICET-2025 నోటిఫికేషన్‌(Notification) ఇవాళ(మార్చి 6) విడుదలైంది.

TG ICET-2025 నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే TG ICET-2025 నోటిఫికేషన్‌(Notification) ఇవాళ(మార్చి 6) విడుదలైంది. ఈ క్రమంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 10వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు అన్‌లైన్‌లో అప్లికేషన్స్‌ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 550, బీసీలు, జనరల్‌ విద్యార్థులు రూ. 750 చెల్లించాలి. అనంతరం జూన్‌ 8, 9 తేదీల్లో ఐసెట్‌ పరీక్ష(ICET Exams)లను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://tgche.ac.in/ సందర్శించండి.

రూ.250 అపరాధ విషయంతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తులలో పొరపాట్లు ఉంటే మే 16 నుంచి 20 వరకు వాటిని సరిచేసుకోవచ్చు. ఈక్రమంలో ఆన్‌లైన్‌‌లో దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు కంప్యూటర్ బెస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. 4 షిఫ్టులలో రాష్ట్రవ్యాప్తంగా 16(CBT) విధానంలో ఆన్‌లైన్‌ పరీక్ష(Oniline Exam) కేంద్రాలలో జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక వీటికి సంబంధించి జూన్ 21న ప్రాథమిక కీ(Primary Key) విడుదల చేస్తారు. ఈ ‘కీ’ పై అభ్యంతరాలను జూన్ 22 నుంచి 26 వరకు స్వీకరిస్తారు. జులై 7న ఫలితాలను విడుదల చేస్తారు.

Next Story