- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారి పేర్లు బయటపెడతా.. చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
క్యాసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: క్యాసినో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మకాం వేసిన చీకోటి ప్రవీణ్ శుక్రవారం విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనపై ఈడీ విచారణ కొనసాగుతోందని.. ఎవరెవరు క్యాసినో ఆడారో సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయటపెడతానన్నారు. స్నేహితుల పిలుపుతో ఏపీకి వచ్చానన్నారు. సరదాగా కోడి పందాలు ఆడతామని చెప్పారు. గతంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని వచ్చిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. అవన్ని వట్టి ఆరోపణలే అన్నారు. గతంలో టీడీపీ హాయాంలోనూ ఇక్కడ కోడిపందాలు ఆడామని ఇప్పుడు కూడా కోడిపందాలు ఆడతామని ఇదంతా జగమెరిగిన సత్యమే కదా అన్నారు. గుడివాడ క్యాసినో ఆరోపణల అంశంలో టీడీడీ తనను ఓ అస్త్రంగా మార్చుకోవాలని చూసి అట్టర్ ప్లాప్ అయిందని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, బైరి నరేష్ లాంటి నాస్తిక సంఘం నేతలకు బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు.






