TG: సమ్మర్ వేళ గుడ్ న్యూస్.. ఇకనుంచి సత్వర విద్యుత్ సేవలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-22 09:57:07  IST  )

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తన వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది.

TG: సమ్మర్ వేళ గుడ్ న్యూస్.. ఇకనుంచి సత్వర విద్యుత్ సేవలు
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) తన వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారానే పొందేలా వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ(Musharraf Farooqui) తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ వాట్సాప్‌లో 8712441912 నంబర్‌ను సేవ్ చేసుకుని Hi అని మెసేజ్ పంపడం ద్వారా ఫిర్యాదుల నమోదు, బిల్లింగ్ వివరాలు, విద్యుత్ సరఫరా స్థితి సమాచారం వంటి వివిధ సేవలను సులభంగా పొందవచ్చు. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యుత్‌కు సంబంధించిన సమాచారాన్ని వేగంగా పొందగలుగుతారు. ప్రతి వినియోగదారుడు ఈ నంబర్‌ను తమ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవడం ద్వారా విద్యుత్ సేవలను మరింత సులభంగా, సురక్షింతంగా వినియోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది.

Next Story