- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు చేస్తే సంసారం.. మేం చేస్తే వ్యభిచారమా: KTRపై సంపత్ కుమార్ ఫైర్
గద్వాల (Gadwal)కు ఏ మొహం పెట్టుకుని వస్తావ్.. అంటూ కేటీఆర్ (KTR)పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: గద్వాల (Gadwal)కు ఏ మొహం పెట్టుకుని వస్తావ్.. అంటూ కేటీఆర్ (KTR)పై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) ఫైర్ అయ్యారు. ఇవాళ గద్వాలలో అధికార పార్టీకి పలువురు నాయకులు బీఆర్ఎస్ (BRS) పార్టీలో కేటీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ.. గద్వాలకు కేటీఆర్ ఏం మొహం పట్టుకుని వస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేనేత శాఖ మంత్రిగా ఉన్న ఆయన గద్వాలలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికలను మోసం చేశాడని ధ్వజమెత్తారు. శంకుస్థాపన ఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయని.. కేటీఆర్ వెళ్లి చూడాలని డిమాండ్ చేశారు. తుమ్మిల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి సగం సగం పనులు చేసిపోయారని ఆరోపించారు. సరైన సౌకర్యాలు కల్పించకుండానే వంద పడకల ఆస్పత్రికి రిబ్బన్ కట్ చేసి పోయారని మండిపడ్డారు.
10 ఏళ్లలో గద్వాల జిల్లా పరిధిలో 4 మున్సిపాలిటీలకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో ప్రజా పాలనలో వంద పడకల ఆస్పత్రిని అన్ని సౌకర్యాలతో తిరిగి ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. తమ సర్కార్ హయాంలో మల్లమ్మ గుంటకు సర్వే పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. రూ.120 కోట్లతో జూరాలపై కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ, మగ అంటూ కామెంట్ చేస్తున్నారని.. వారికి టికెట్ ఇచ్చిన నాడు కేటీఆర్‌కు ఏ లింగమో తెలీదా అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ విప్‌గా ఉన్నప్పుడు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఐదుగురిని, టీడీపీ ఎమ్మెల్యేలను 15 మందిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు సంసారం.. తాము చేస్తే వ్యభిచారామా.. అని దుయ్యబట్టారు. నడిగడ్డకు వచ్చే హక్కు కేటీఆర్‌కు లేదని సంపత్ కుమార్ కామెంట్ చేశారు.






