- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది.. బీజేపీకి మంత్రి పొన్నం సూటి ప్రశ్న
42 శాతం బీసీ రిజరేషన్లపై కాంగ్రెస్ (Congress) పార్టీ కావాలనే తాత్సారం చేస్తోందని, కులగణన, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కాకి లెక్కలు కోర్టుల ముందు తేలుతాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: 42 శాతం బీసీ రిజరేషన్లపై కాంగ్రెస్ (Congress) పార్టీ కావాలనే తాత్సారం చేస్తోందని, కులగణన, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కాకి లెక్కలు కోర్టుల ముందు తేలుతాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరధిలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. కానీ బీసీలను బీజేపీ (BJP) నేతలు తప్పుదోవ పట్టిస్తూ.. మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ (BC Reservation) బిల్లుకు అన్ని పార్టీలు తమ సంపూర్ణ మద్దతను ప్రకటించాయని తెలిపారు.
నాడు అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దుతు ఇచ్చి.. ఢిల్లీలో మళ్లీ అదే బిల్లును కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసలు బీసీలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో బీజేపీ నేతలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిందని అన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు క్వాలిటీ ఫుడ్‌ను అందిస్తామని, హైదరాబాద్, జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్ చేశారు.






