- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఏం రాహుల్.. మంచిగున్నవా?’.. ప్రెస్‌మీట్‌లో నవ్వులు పూయించిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) మరోసారి తన ప్రత్యేక శైలితో మీడియా సమావేశాన్ని ఉల్లాసంగా మార్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) మరోసారి తన ప్రత్యేక శైలితో మీడియా సమావేశాన్ని ఉల్లాసంగా మార్చారు. చాలా కాలం తర్వాత బహిరంగంగా కనిపించిన కేసీఆర్, ఆదివారం తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూనే, అక్కడ ఉన్న జర్నలిస్ట్ రాహుల్‌ను ఎప్పటిలాగే ఆప్యాయంగా పలకరించారు. ‘ఏం రాహుల్.. మంచిగున్నవా?’ అంటూ చిరునవ్వుతో అడగడంతో సమావేశ హాల్లో నవ్వులు వెల్లువెత్తాయి.
తనకు, రాహుల్‌కు మధ్య ఉన్న స్నేహాన్ని ఉద్దేశిస్తూ కేసీఆర్ ఒక చిన్న జోక్ కూడా వేశారు. ఆ వ్యాఖ్యలు మీడియా ప్రతినిధులను నవ్వుల్లో ముంచెత్తాయి. రాహుల్ చేసిన స్పందనతో ప్రెస్‌మీట్ మరింత ఉల్లాసంగా మారింది. కేసీఆర్ ఈ ప్రెస్‌మీట్‌లో రాజకీయ అంశాలతో పాటు ఆయన సహజమైన హాస్యం మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా రోజుల తర్వాత ప్రజల ముందుకు వచ్చిన కేసీఆర్, తనదైన శైలిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆకర్షించారు. వీడియో ఇదే..






