BRS: కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం ఉంది..? ​మాజీ ఎమ్మెల్యే రసమయి

by Ramesh Goud |

రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులకు అసహనం ఎందుకు వస్తుందో తెలియడం లేదని, మొన్న బీఆర్​ఎస్​ఎంఎల్​ఏ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మరో నేత చింతం సదానందం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

BRS: కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం ఉంది..? ​మాజీ ఎమ్మెల్యే రసమయి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ముగ్గురు మంత్రులకు అసహనం ఎందుకు వస్తుందో తెలియడం లేదని, మొన్న బీఆర్​ఎస్​ఎంఎల్​ఏ పాడి కౌశిక్ రెడ్డి(Padi Kowshik Reddy) మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్(Rasamayi Balakishan), మరో నేత చింతం సదానందం(Chintham Sadhanandham) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్ లో వారు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ లో మొన్న ముగ్గురు రాష్ట్ర మంత్రుల సాక్షిగా జరిగిన అరాచకాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారని, ప్రభుత్వాన్ని ఆహా ఓహో అని ఢంకా బజాయించి మాట్లాడారని ఈ క్రమంలోనే తమ ఎంఎల్ఏ కౌషిక్​రెడ్డికి అనుమానం వచ్చి ఏ పార్టీ తరఫు నుంచి మాట్లాడుతున్నారు సంజయ్ కుమార్ గారు అని మర్యాదపూర్వకంగానే కౌశిక్ రెడ్డి అడిగారన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని తాము అడుగుతున్నామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు నిలదీస్తేనే అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్లు యావత్​రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతారని తాము అడుగుతున్నమన్నారు.

ఎంఎల్​ఏ కౌశిక్​రెడ్డి ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెడుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీనే తలపిస్తోందని రసమయి బాలకిషన్ , చింతం సదానందం లు అన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఎంఎల్​ఏ అరికెపూడి గాంధీపై కేసు పెట్టారా? మరి కౌశిక్ రెడ్డిపై నాలుగు కేసులు ఎందుకు పెట్టారు ? ఇదేం పాలన అని వారు నిలదీశారు. భువనగిరిలో బీఆర్​ఎస్​పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై కేసు ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎంఎల్​ఏ సంజయ్ కు సిగ్గు లేకుండా ఇంకా శాసనసభ స్పీకర్ ను కలిశాడని, దమ్ముంటే శాసనసభ్యత్వానికి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్​చేస్తున్నామన్నారు. మీలా బానిస లాగా బతకాలని అనుకోవటం లేదనే కౌశిక్ రెడ్డి పై ద్వేషం పెంచుకున్నారని మండిపడ్డారు. తమ పార్టీ మౌనం చేతకాని తనం అనుకోవద్దు అని, దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్​సీటుపై గెలవాలని సవాల్​విసురుతున్నామన్నారు. రాజీనమా చేసేందుకు సంజయ్ నీకు ఎందుకు భయం ? అని వారు ప్రశ్నించారు. దళిత బంధు పెట్టి రూ. 10 లక్షలు కేసీఆర్ సర్కారు ఇచ్చారని, దమ్ముంటే మీరు దళిత బంధును అమలు చేయండని నిలదీస్తున్నామన్నారు. ప్రశ్నిస్తే పాపం అన్నట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ , మరో నేత చింతం సదానందం అన్నారు.

Next Story