ఇదేం పని శ్రీనివాసా..? క్యాసినో, కోడి పందేలకు అడ్డాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌజ్!

by Kema Shiva Kumar |

నగర శివార్లలో అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా క్యాసినో (Casino), పేకాట (Poker), కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఇదేం పని శ్రీనివాసా..? క్యాసినో, కోడి పందేలకు అడ్డాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: నగర శివార్లలో అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా క్యాసినో (Casino), పేకాట (Poker), కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి నగర శివారులోని తోలుకట్ట (Tholukatta) ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (BRS MLC Pochampally Srinivasa Reddy) ఫామ్‌హౌజ్‌లో సకల సౌకర్యాలతో క్యాసినో (Casino), పేకాట (Poker), కోడి పందేలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఫామ్‌హౌజ్‌పై ఆకస్మికంగా దాడి చేశారు. మొత్తం ఫామ్‌హౌజ్‌లో ఉన్న 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా భారీ క్యాసీనో మిషన్‌ (Casino Machine), కాయిన్స్‌ (Coins‌, 46 కోడి కత్తులతో పాటు రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లను సైతం సీజ్ చేశారు.పరారీలో ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తోలుకట్టలోని సర్వే నెంబర్ 165/A, 165/A2 /1లో 165/E లలో 11 ఎకరాలకు పైగా భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (BRS MLC Pochampally Srinivasa Reddy) అప్పట్లో చెన్నకేశవులు (Chennakeshavulu) అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అదే ఫామ్‌హౌజ్‌లో మంగళవారం రాత్రి క్యాసీనో, పేకాట, కోడి పందేలు కొనసాగుతుండగా పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే మరి.

Next Story