- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : జూరాల నీరు వృథాగా పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ రిజర్వాయర్లను నింపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్.. జూరాల ప్రాజెక్టు(Jurala Project)కు వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకోకుండా వృధాగా పోనిస్తున్నారని అన్నారు. వరద నీటిని తరలించే ప్రణాళిక ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.
ముఖ్యంగా కరువు పీడిత జిల్లాలైన మహబూబ్‌నగర్, నల్గొండలలో రిజర్వాయర్లను నింపే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అదనంగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పంపులు అందుబాటులో ఉన్నప్పటికీ, కాలువలు తవ్వకపోవడం వల్ల నీటిని సమర్థవంతంగా వినియోగించుకోలేని పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






