SEC: స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎన్నికల సంఘం నిర్ణయమేంటి?

by Prasad Jukanti |

స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం

SEC:  స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఎన్నికల సంఘం నిర్ణయమేంటి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) అంశంలో పూటకో ట్విస్ట్ నమోదు అవుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana SEC) ఇచ్చిన నోటిఫికేషన్‍కు బ్రేకులు వేసిన హైకోర్టు తాజాగా వెలువడిన ఉత్తర్వుల్లో పాద విధానంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎలక్షన్స్ నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవో 9,41, 42 పై మాత్రమే రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయనేది ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ ఉత్కంఠగా మారింది.

స్పష్టత ఇవ్వండి:

ఓపెన్ కేటగిరిలో సీట్లను నోటిఫై చేసి దామాషా ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచన మేరకు ఈసీ న్యాయ నిపుణుల సూచనలు తీసుకోబోతున్నట్లు సమాచారం. న్యాయనిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చలు జరిపి వారి సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరనున్నట్లు సమాచారం. న్యాయనిపుణులు, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు ఎస్ఈసీ లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే హైకోర్టు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో ఈసీకి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Next Story