- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు ఏం జరుగుతోంది..? మైనార్టీ గురుకులాలపై ఎంక్వైరీకి మంత్రి ఆదేశం
మైనార్టీ గురుకులాల్లో ఏం జరుగుతోందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మైనార్టీ గురుకులాల్లో ఏం జరుగుతోందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. విచారణ జరిపి, పూర్తి స్థాయి రిపోర్టు ఇవ్వాలని స్పెషల్ సీఎస్ హోదాలో ఆల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్స్‌ను పర్యవేక్షిస్తున్న సబ్యసాచి ఘోష్‌ను ఆదేశించారు. ‘దిశ’లో ఈ నెల 15న ‘మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్టు పెత్తనం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై మంత్రి లక్ష్మణ్ స్పందించి విచారణకు ఆదేశించారు. మైనార్టీ గురుకులం సొసైటీలో ఎంత మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు? వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించారు? వారి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? మిగతా గురుకులాల్లోనూ అదే తరహా విజిలెన్స్ టీమ్స్ ఉన్నాయా? అనే కోణంలో విచారించి పూర్తి స్థాయి రిపోర్టు ఇవ్వాలని మంత్రి ఆదేశించినట్టు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అనేక విమర్శలు, ఆరోపణలు
సొసైటీ సెక్రెటరీ షఫీ ఉల్లా అండ దండలతో విజిలెన్స్ టీంలో పనిచేస్తున్న కొందరు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. గురుకులాల్లో తనిఖీల పేరుతో ప్రిన్సిపాల్స్ నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకపోతే మెమోలు ఇవ్వడమో, సస్పెండ్ చేయడమో చేస్తున్నారని విమర్శలు సైతం ఉన్నాయి. సదరు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నియమకాలకు అనుమతి తీసుకోలేదని ఫిర్యాదులు సైతం ప్రభుత్వానికి ప్రభుత్వానికి అందాయి. దీనికి తోడు దిశ పత్రికలోనూ కథనం ప్రచురితం కావడంతో మంత్రి విచారణకు ఆదేశించారు.






