VH: బంగ్లాదేశ్‌‍లో హిందువులపై దాడులకు ఎస్ఐఆర్‍‍తో లింక్: వీహెచ్

by Prasad Jukanti |

బంగ్లాదేశ్‍లో వరుసగా హిందువుల హత్యోదంతాలు కలకలం రేపుతున్నాయి.

VH: బంగ్లాదేశ్‌‍లో హిందువులపై దాడులకు ఎస్ఐఆర్‍‍తో లింక్: వీహెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‍లో హిందువులపై (Attacks on Hindus) దాడులు కొనసాగుతున్నాయి. దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరువక ముందే మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. మయమన్‍సింగ్ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటిగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న బజేంద్ర బిశ్వాస్ (42)ను అతడి సహోద్యోగి కాల్చి చంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే పొరుగు దేశంలో వరుసగా హిందువుల హత్య ఘటనలపై భారత్‍లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (V.Hanumantha Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలనకు భారత్‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు లింక్ పెట్టారు. ఎస్ఐఆర్ వల్లే బంగ్లాదేశ్‍లో అల్లర్లు జరుగుతున్నాయని దీనికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. తాజాగా ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన వీహెచ్.. కేవలం తమ రాజకీయం కోసమే ఇద్దరు వ్యక్తులు ఈ డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ఇంకెంతకాలం కొనసాగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. వీరు భారత్‍ను హిందూ దేశంగా పిలుస్తున్నారని కానీ ఇది ఒక లౌకిక దేశం అన్నారు.

Next Story