MP Raghunandan Rao : బావ బామ్మర్దులు పదేళ్ళు ఏం చేశారు? : రఘునందన్ రావు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) విరుచుకుపడ్డారు.

MP Raghunandan Rao : బావ బామ్మర్దులు పదేళ్ళు ఏం చేశారు? : రఘునందన్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) విరుచుకుపడ్డారు. పదేళ్ళు అధికారంలో ఉండి HCU భూములపై ఎందుకు సమీక్ష చేయలేదని కేటీఆర్(KTR), హరీష్ రావుల(Harish Rao)పై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం(Kancha Gachibouli Land Issue)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటు చేసిన పర్యావరణ, కేంద్ర అటవీశాఖల సాధికారిక కమిటీ(Supreme Court Empowered Committee) నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లోని భూములను పరిశీలించారు. కాగా కేంద్ర కమిటీతో తెలంగాణ బీజేపీ నేతలు కమిటీతో భేటీ అయ్యారు.

అనంతరం బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ళు బీఆర్ఎస్ నేతలు నిద్రపోయి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఉద్దేశం ఒకటేనని.. భూములు అమ్ముకోవడమే వారి లక్ష్యం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములను అడ్డగోలుగా అమ్మేశారని, ఎవరికి పడితే వారికి రోడ్లు వేసుకోవడానికి అనుమతులు మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఏం చేశారని, ఎక్కడికి పోయారని నిలదీశారు. వర్సిటీ భూములపై ఇప్పుడు బావ బామ్మర్దులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని.. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్, హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Next Story