- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో పోలీసులు ఏం పీకుతున్నారు..? మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో మంత్రుల మధ్య విబేధాలతో ఐఏఎస్ ఆఫీసర్లు పరేషాన్ అవుతూ నలిగిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మంత్రుల మధ్య విబేధాలతో ఐఏఎస్ ఆఫీసర్లు పరేషాన్ అవుతూ నలిగిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వాలకు మొదటి నుంచి ఉన్న అలవాటేనని కామెంట్ చేశారు. మంత్రి జూపల్లి వేధింపుల వల్లే ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారని ఆరోపించారు. మంత్రుల విభేదాలతో ప్రభుత్వంలో భాగస్వాములైన ఐఏఎస్‌లు పరేషాన్ అవుతున్నారని.. నలిగిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో మిగిలిన అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అల్టిమేట్‌గా బెదిరింపులు వాస్తవం కాదా..
మంత్రుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే.. తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుదని అన్నారు. తాజాగా అవినీతికి పాల్పడిన ఒక ఓఎస్డీని స్వయంగా మంత్రి కొండా సురేఖ తన కారులో తీసుకెళ్లి ఇంటికి అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి రక్షించారని ఆరోపించారు. సెటిల్‌మెంట్లు చేయమని సీఎం రేవంత్ రెడ్డే తుపాకీ ఇచ్చాడంటూ మంత్రి కుమార్తె చెబుతోందని.. ఇంత కంటే సాక్ష్యం ఇంకేం కావాలన్నారు. ఈ విషయంలో సీఎం వర్గీయులు, మంత్రి వర్గీయులు పరస్పర ఆరోపణలు చేసుకున్నా.. అల్టిమేట్‌గా బెదిరింపులు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి నివాసం పూర్తిగా సెటిల్‌మెంట్లకు అడ్డగా మారిందని ధ్వజమెత్తారు. నీకింత.. నాకింత అనే సెటిల్‌మెంట్లు తప్ప.. రాష్ట్రంలో పాలన లేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ తెలంగాణలో నడుస్తుందని అన్నారు. ఓపెన్‌గా ఇంత అరాచకాలు జరుగుతుంటే బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేస్తుంటే, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడుతుంటే బీజేపీకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సీబీఐ లాంటి సంస్థలు ఎందుకు రావడం లేదని కేటీఆర్ అన్నారు.
ఖాకీ బుక్కు కాకి ఎత్తుకెళ్లిందా..
తమకు ఏ బుక్కు లేదని.. కేవలం ఖాకీ బుక్కు మాత్రమే ఉందని చెప్పిన డీజీపీ శివధర్‌రెడ్డి పత్తా లేడన్నారు. గన్నులు పెట్టి బెదిరించినా గమ్మునుంటారా.. ఖాకీ బుక్కు కాకి ఎత్తుకెళ్లిందా అని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ అధ్వాన పాలనపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టులను రీ ట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టారని.. సీఎం, మంత్రులు పారిశ్రామికవేత్తపై తుపాకీతో బెదిరింపులకు దిగిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు ఏం పీకుతున్నారని ప్రశ్నించారు. డీజీపీ శివధర్‌రెడ్డికి నిజాయితీ గల అధికారిగా పేరుందని.. ఈ విషయంలో ఆయన మంత్రి సురేఖ కూతురు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సిస్సియారిటీని రుజువు చేసుకోవాలని సవాల్ విసిరారు. మంచిరేవుల భూముల కోసం గన్ను పెట్టి బెదిరిస్తున్నారని మంత్రి కూతురు స్వయంగా చెప్పిందని.. మంత్రులు ఎక్కడ సంతకం పెట్టారో సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలవకూడదు అన్న నియమాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ మంత్రి బిడ్డకు తెల్వడం, జపాన్‌లో ఉన్న సీఎం ఫైలు వెనక్కి తెప్పించుకోవడం అంతా ఆరాచకంగా మారిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రౌడీలు, గుండాలను పెట్టుకుని ఊరేగింపులు చేస్తున్నారని.. రాష్ట్రంలో సర్కారు నడుస్తుందా.. లేక సర్కస్ నడస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.
READ MORE ...






