విదేశాల్లో తెలంగాణ కార్మికుల రక్షణకు చర్యలేవి? : ఎంపీ రఘురాం రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-08-08 17:26:35  IST  )

విదేశాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు.

విదేశాల్లో తెలంగాణ కార్మికుల రక్షణకు చర్యలేవి? : ఎంపీ రఘురాం రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. శుక్రవారం ఈ అంశాన్ని ఎంపీ ప్రస్తావిస్తూ.. రాష్ట్రాల వారీగా వలస కార్మికుల గణాంకాల వివరాలను కోరారు. దీనికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

విదేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులు 45 వేలకు పైగానే ఉంటున్నారని మంత్రి తెలిపారు. ఇమ్మిగ్రేషన్ చెక్ రిక్వెస్ట్ ( ఈసిఆర్) పాస్ పోర్ట్ లను కలిగి ఉన్న..18 కేటగిరీ దేశాల్లో ఉపాధికి వెళ్ళిన భారతీయ కార్మికుల ఈ - మైగ్రేట్ పోర్టల్ ద్వారా మంత్రిత్వ శాఖ పూర్తి డేటాను సేకరిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఇలా ఇతర దేశాల్లో వివిధ పనులు చేసుకుంటున్న భారతీయ కార్మికులు ఈ ఏడాది గణాంకాల ప్రకారం 16,06,964 మంది ఉన్నారని, ఇందులో తెలంగాణకు సంబంధించి 2020లో 2,984 మంది ఉండగా, ఆ సంఖ్య 2025 నాటికి 45,213కు చేరినట్లు పేర్కొన్నారు.

భద్రతకు కాన్సులేట్ ఎప్పుడూ సిద్ధమే

విదేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులతో సహా.. అన్ని రాష్ట్రాల వారి భద్రత, రక్షణకు రాయబార కార్యాలయం (కాన్సులేట్) పనిచేస్తుందని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. ఈ-మెయిల్, అత్యవసర ఫోన్ నెంబర్లు, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా సంప్రదించగానే.. స్పందించేందుకు ప్రత్యేక విభాగాలు, దుబాయ్, రియాద్, జెడ్డా, కౌలాలంపూర్ కీలక ప్రదేశాల్లో భారతీయ సహాయత కేంద్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. కార్మికుల పని ప్రదేశాలను పరిశీలించి, అక్కడ యజమానులతో సంప్రదించి సూచనలు చేస్తాయని తెలిపారు.

మహిళా కార్మికుల పక్షాన ప్రత్యేక రిక్రూట్ ఏజెన్సీలు

విదేశాల్లో పనులకు వెళ్లే.. మన దేశ మహిళా కార్మికులను నియమించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రిక్రూటింగ్ ఏజెన్సీలకు మాత్రమే అధికారం ఇచ్చినట్లు కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. కష్టాల్లో ఉన్న భారతీయ పౌరులకు ఆర్థిక, చట్టపర సహాయం అందించేందుకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐ సిడబ్ల్యూఎఫ్) వినియోగించుకుని.. అత్యవసర సమయాల్లో మన దేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వివరించారు.

Next Story