- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి శనివారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి శనివారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ( telangana Rising Global Summit)కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. ఈ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుందని తెలిపారు. అయితే, ఈ ఆహ్వానానికి ప్రతిస్పందిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే సమయంలో అదే తేదీల్లో తాను జిల్లాల పర్యటన ఉందని, ముందుగానే నిర్ణయించబడ్డ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో సమ్మిట్‌కు హాజరు కావడం సాధ్యం కాదని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ సమ్మిట్ తెలంగాణ రాష్ట్రానికి విలువైన ఫలితాలను అందిస్తుందని, నిర్మాణాత్మక చర్చలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆమె సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.






