- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శభాష్ తెలంగాణ బిడ్డ..! ఉమెన్ క్రికెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం
శభాష్ (Well done) తెలంగాణ బిడ్డ! (Telangana child!) అంటూ.. ఉమెన్ క్రికెటర్ గొంగడి త్రిష (women cricketer Gongadi Trisha) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు (praised) కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్: శభాష్ (Well done) తెలంగాణ బిడ్డ! (Telangana child!) అంటూ.. ఉమెన్ క్రికెటర్ గొంగడి త్రిష (women cricketer Gongadi Trisha) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు (praised) కురిపించారు. మలేషియా (Malaysia)లోని కౌలాలంపూర్ (Kuala Lumpur) వేదికగా జరిగిన అండర్-19 మహిళల వరల్డ్ కప్ (ICC Under-19 Womens T20 World Cup 2025)లో స్కాట్లాండ్ (Scotland) జట్టుపై టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. సూపర్ సిక్స్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ సత్తా చూపించింది. ఇవాళ్టి మ్యాచ్‌లో తెలంగాణలోని భద్రాచలం ప్రాంతానికి చెందిన క్రికెటర్ గొంగడి త్రిష (Gongadi Trisha) మొదటి సెంచరీతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. గొంగడి త్రిషను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన.. మహిళల అండర్19 టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే.. మొట్టమొదటి సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా నిలిచి, ప్రపంచ వేదికపై మన దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా (Badradri- Kothagudem District), భద్రాచలంకు (Badrachalam) చెందిన త్రిష.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. మున్ముందు కూడా తను మరింతంగా రాణించి, తెలంగాణ క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలవాలని సీఎం ఆశించారు.
అంతేగాక త్రిష లాంటి మరింత మంది మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన మన క్రీడాకారులకు తగిన గుర్తింపునిస్తూనే.. మరింత మంది తెలంగాణ బిడ్డలు ప్రపంచస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ (Young India Sports University) ఏర్పాటుకు సంకల్పించామని అన్నారు. క్రీడల ప్రోత్సాహానికి మన ప్రజా ప్రభుత్వం (public government) కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, త్రిషలాంటి క్రీడాకారిణిల స్ఫూర్తితో, మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






