ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్

by Naga Rani Yarlagadda |

ఉపరితల ఆవర్తనం (Surface Periodicity), ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు (Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపరితల ఆవర్తనం (Surface Periodicity), ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు (Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో నేడు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

అలాగే రేపు (సోమవారం) ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. వర్షాల సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వివరించింది. వర్షాల సమయంలో ఎవరూ చెట్ల కింద, హోర్డింగుల సమీపంలో నిలబడవద్దని సూచించింది.

Next Story