Minister Sridhar Babu : ఆ రైతులను ఆదుకుంటాం : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

తెలంగాణ(Telangana)లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు(Untimely Rains) పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఓ శుభవార్త వినిపించింది.

Minister Sridhar Babu : ఆ రైతులను ఆదుకుంటాం : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు(Untimely Rains) పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఓ శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం(Compensation) చెల్లిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) బుధవారం ప్రకటించారు. పంటలు నష్టపోయిన, దెబ్బతిన్న రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అకాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, ధాన్యం, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు త్వరలోనే పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ప్రకటన రైతుల్లో ఆశాభావాన్ని కలిగించినప్పటికీ, పరిహారం మొత్తం, విధానం గురించి ఇంకా స్పష్టమైన వివరాలు వెల్లడి కాలేదు.

Next Story