CM Revanth Reddy: చిన్నారులపై లైంగిక హింసకు పాల్పడేవారిపై దయాదాక్షిణ్యాలు చూసేది లేదు:సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-07-05 07:07:46  IST  )

చిన్నారులు, మహిళల భద్రతకు మా ప్రభుత్వం ప్రయార్టీ ఇస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy: చిన్నారులపై లైంగిక హింసకు పాల్పడేవారిపై దయాదాక్షిణ్యాలు చూసేది లేదు:సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో నిందితుల పట్ల తమ ప్రభుత్వం ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపబోదని అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని అన్నారు. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో (MCRHRD) 'లైంగిక దాడులు బాధిత చిన్నారుల రక్షణ, భద్రత' అంశంపై తెలంగాణ భరోసా ఆధ్వర్యంలో జరగనున్న సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్డు జడ్జిలు, రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు తదిరులు పాల్గొన్న ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులు, మహిళల భద్రతకు మా ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తోందని చెప్పారు. లైంగిక హింస నుంచి చిన్నారులు, మహిళలను రక్షించేందుకు ఎంత దూరమైనా వెళ్తామన్నారు. రాష్ట్రంలో 29 భరోసా సెంటర్లు ఉన్నాయని ఈ సెంటర్ల ద్వారా ఫ్రెండ్లీ వాతావరణంలో బాధితులకు పోలీస్, న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియా అబ్యూజ్ ను కంట్రోల్ చేయాలని సూచించారు.

Next Story