Thummala: జిల్లాకో పామాయిల్ పరిశ్రమ: మంత్రి తుమ్మల

by Prasad Jukanti |   (  Updated:2025-07-16 09:52:21  IST  )

దాయం వచ్చే పంటలను ఎంచుకోవాలని రైతులకు మంత్రి తుమ్మల సూచించారు.

Thummala: జిల్లాకో పామాయిల్ పరిశ్రమ: మంత్రి తుమ్మల
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని రాష్ట్రంలో జిల్లాకో ఫామాయిల్ పరిశ్రమ (Palm Oil Industry) ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఇవాళ పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఇందిరాశక్తి సంబరాల సభకు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో పాటు తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగేశ్వరరావు.. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తేనే ఇల్లు అయినా, ప్రభుత్వం అయినా చల్లగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నదని ఇళ్లు, రేషన్ కార్డులు మహిళల పేరు మీదే ఇస్తున్నట్లు చెప్పారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ. 21 వేల కోట్లు వేశామని రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు జమ చేశామని చెప్పారు.

Next Story