- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం : సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో(Triumph of public governance) శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) పాల్గొన్నారు. నేడు తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. సైబర్ నేరాల కట్టడికి ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయం తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. గత పదేళ్ళ పాలన చేసిన బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చారు. డ్రగ్స్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. కాలేజీ యాజమాన్యాలకు విద్యార్థులపై ఓ కన్నేసి ఉంచాలని స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశామన్నారు. యువత డ్రగ్స్ కు బలైతే రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుందని, జీవితాలను నాశనం చేసే అలవాట్లను వదులుకోవాలని యువకులకు సీఎం సూచించారు.
- Tags
- CM Revan Reddy