- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తగ్గేది లేదు..! జైలులో కూడా ఇద్దరం కలిసే ఉంటాం: అఘోరీ సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీని (Lady Agori) పోలీసులు మంగళవారం యూపీలో (Uttarpradesh) అరెస్టు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీని (Lady Agori) పోలీసులు మంగళవారం యూపీలో (Uttarpradesh) అరెస్టు చేశారు. అఘోరీతో పాటు ఇటీవల తనను పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. పూజల పేరుతో రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారని, అడిగితే బెదిరిస్తున్నారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు అఘోరిపై మోకిలా పోలీసులు చీటింగ్, బెదిరింపుల కేసు నమోదు చేశారు.
అఘోరీని అరెస్టు చేసిన పోలీసులు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ అరెస్టుపై స్పందించిన అఘోరీ మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తున్నాని చెప్పింది. ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని, జైలుకు వెళ్లినా తన భార్య వర్షిణి తనతోనే ఉంటుందని సంచలన కామెంట్లు చేసింది.
కాగా, గత కొంతకాలంగా అఘోరి, వర్షిణిల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ కూతురిని మాయమాటలతో లోబరుచుకుని, కేదార్నాథ్ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వర్షిణి కుటుంబం ఆరోపిస్తుంది. ఇక వీళ్ల పెళ్లికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయినా సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఈ జంట ఓ సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించింది.
ఇక లేడీ అఘోరీతో ఆరు నెలల క్రితం పరిచయమైనట్లు ఫిర్యాదు చేసిన బాధిత మహిళ తెలిపింది. అప్పటి నుంచి తరచూ ఫోన్లు చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని ఒక పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మాయమాటలు చెప్పిందని సదరూ మహిళ వెల్లడించింది. లేడీ అఘోరీ మాటలు నమ్మి పూజకు అంగీకరించానని చెప్పింది. వారం రోజుల్లో పూజ చేద్దామని చెప్పడంతో నమ్మి.. ఖర్చుల కోసం రూ.5 లక్షలు లేడీ అఘోరీ అకౌంట్లో వేశానని బాధిత మహిళ వాపోయింది. ఆ తర్వాత యూపీలోని ఉజ్జయిని ఫామ్ హౌస్‌లోకి తీసుకెళ్లి పూజలు చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో రూ.5 లక్షలు వేయాలని.. లేక పోతే పూజ విఫలమై అరిష్టం జరుగుతుందని భయపెట్టిందని చెప్పింది. చివరికి మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది.






