ఎక్కడ కనిపించినా ప్రకాశ్ రాజ్ తల నరికేస్తాం.. బీజేపీ నేత వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-04-22 11:45:05  IST  )

రామలక్ష్మణులపై ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దాడి చేస్తామని హెచ్చరించారు.

ఎక్కడ కనిపించినా ప్రకాశ్ రాజ్ తల నరికేస్తాం.. బీజేపీ నేత వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ యాక్టర్ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఇటీవల రామలక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందువుల మనోభావాలు కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారని హిందువులు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి (Vanipally Srinivas Reddy) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శ్రీరాముడు, లక్ష్మణుడుపై వ్యంగ్యంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్‌ తల నరికేస్తామని హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ బ్రతికే అర్హత కోల్పోయారని ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడే నరికేయాలని, ఎవరు చంపేసినా ఆ బాధ్యత నేను తీసుకుంటానన్నారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన శ్రీనివాస్ రెడ్డి.. హిందూ ధర్మంపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ చొరవ తీసుకోండి:

ప్రకాశ్ రాజ్‍ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. లేదా షూటింగ్‍ల వద్దే దాడి చేస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటి వారు చొరవతీసుకుని ప్రకాశ్ రాజ్‍ను వెంటాడాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ప్రొడ్యూసర్స్, దిల్‍రాజ్ వంటి వారు ఎవరూ అతడికి రోల్స్ ఇవ్వొద్దన్నారు. మా అసోసియేషన్ పెద్దలు కూడా ఆలోచించాలన్నారు. ఇండస్ట్రీలో కృష్ణుడిని, రాముడిని, యమధర్మరాజును జోకర్ల మాదిరిగా చూపించారు. కానీ ఆ రోజులు అయిపోయాయి. ఇప్పుడు ఇది నయా భారత్ అని ఎంటర్ టైన్ మెంట్‍కు కూడా హద్దు ఉండాలన్నారు. ప్రకాశ్ రాజ్ నాస్తికుడి ముసుగులో హిందువులపై దాడి చేస్తున్నాడని మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి, రాముడి గురించి తక్కువ మాట్లాడితే అలాంటి వారు బతికే అర్హత కోల్పోవాలన్నారు.

Next Story