CM Revanth Reddy: రెండు విడతల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ: సీఎం రేవంత్‌ రెడ్డి

by Prasad Jukanti |

ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

CM Revanth Reddy: రెండు విడతల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ: సీఎం రేవంత్‌ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయం అని పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక మోడల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇందిరాగాంధీ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని చెప్పారు. ఇందిరా గాంధీ జయంతి (Indiramma Jayanti) సందర్భంగా ఇవాళ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ (Indiramma Sarees) కార్యక్రమం ప్రారంభించిన సీఎం మాట్లాడారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని భావించామని అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు సీఎం చెప్పారు. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన ఈ చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 న మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని. ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తామన్నారు. మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నాం. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో రెండు విడతలుగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని మీరే బ్రాండ్ అంబాసిడర్‍గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

మా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత:

ఇందిరమ్మ స్పూర్తితో మహిళా సాధికరతకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించే కార్యక్రమాలు చేపట్టామన్నారు. భూ సంస్కరణలతో పేదలకు ఇందిరా గాంధీ భూపంపిణీ చేశారని, పాకిస్తాన్ ను విడగొట్టి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ భయపడలేదన్నారు. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిందని, పేదలను ఆశలను అడియాశలు చేశారని విమర్శించారు. మన ప్రభుత్వం రాగానే మొదటి విడతగా రూ.22,500 కోట్ల వ్యయంతో నాలుగున్నర ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించామని, ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలని యజమానులను చేశామన్నారు.

Next Story