రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో వీలైనంత తొందరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వీలైనంత తొందరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం తీసుకురావాలంటూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోహిత్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని కమిటీకి తెలియజేశారు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల క్యాంపెయిన్ కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం శనివారం ప్రజాభవన్‌లో శనివారం సమావేశం అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టం కోసం క్యాంపెయిన్ కమిటీ రూపొందించిన ముసాయిదాను కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొన్ని విజ్ఞప్తులు చేశారు. రోహిత్ వేముల కేసును పారదర్శకంగా విచారణ జరిపించాలని, న్యాయం చేయాలని కోరారు.

రోహిత్ వేముల మరణం తర్వాత యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్ల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయని, వారికి విముక్తి కల్పించాలని కోరారు. కర్ణాటక రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరారు. సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు సీనియర్ అంబేద్కరివాది నాయకుడు, ఉపన్యాసకుడు హులికుంటే మూర్తి నేషనల్ లా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. ఆశ్నా సింగ్, అడ్వకేట్ వి. మృదుల, ఏఎస్ఏ జీకేవీకే రాహుల్ , హైదరాబాద్ ‘జస్టిస్ ఫర్ రోహిత్ వెముల’ ఉద్యమం తరఫున రాధికా వేముల, రాజా వేముల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్లు భాంగ్య భుక్య, సౌమ్యా దేచమ్మ, తిరుమల్, రత్నం, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్, డా. డోంత ప్రశాంత్, ఏఎస్ఏ , హెచ్‌సీయూ తిరుపతి, వెన్నెల పాల్గొన్నారు.

Next Story