- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Thummala: జిన్నింగ్ మిల్లుల సమస్యలు సీసీఐ దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి తుమ్మల
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులకు రాష్ట్ర వ్యవసాయ, జౌళి చేనేత శాఖల మంత్రి తుమ్మల శుక్రవారం విజ్ఙప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులకు రాష్ట్ర వ్యవసాయ, జౌళి చేనేత శాఖల మంత్రి తుమ్మల శుక్రవారం విజ్ఙప్తి చేశారు. జిన్నింగ్ మిల్లుల సమస్యలను సీసీఐ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం దిశగా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ నెల 17 నుంచి జిన్నింగ్ మిల్లులు సమ్మే ప్రకటించిన నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో మాట్లాడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ సెక్రటరీని ఆదేశించారు. కేంద్ర జౌళి శాఖ సూచనల మేరకు రాష్ట్రంలో మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి, జిల్లాల వారీ సగటు పత్తి దిగుబడిని లెక్కించేలా కలెక్టర్లకు వెంటనే ఆదేశాలివ్వాలని సెక్రటరీని ఆదేశించారు. సీసీఐ తీసుకొచ్చిన ఎల్1,ఎల్2 నిబంధనలతో రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను సీసీఐ ఎండి దృష్టికి తీసుకెళ్లి, వారి సమస్యల పరిష్కారం దిశగా సీసీఐ ప్రతినిధులతో మాట్లాడాలన్నారు.
ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితితో పంటను అమ్ముకోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కోన్నారు. పత్తిలో తేమ శాతం తక్కువ ఉండే సమయంలో జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లను నిలిపేస్తామని చెప్పడం రైతులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడతాయని అన్నారు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే కేంద్రం జౌళిశాఖ మంత్రికి, సీసీఐ ఎండీకి లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని, జిన్నింగ్ మిల్లుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యల పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ సూచనల మేరకు రాష్ట్రంలో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి జిల్లా వారి సగటు పత్తి దిగుబడిని లెక్కించేలా కలెక్టర్లకు వెంటనే ఆదేశాలివ్వాలని వ్యవసాయ శాఖ సెక్రటరీని మంత్రి తుమ్మల ఆదేశించారు.






