కనీస వసతులు కల్పించలే ఎలక్షన్ బహిష్కరిస్తాం.. 4 గ్రామాల ప్రజల సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |

నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని అడవిలో ఉన్న ఎంగ్లపూర్‌తో పాటు 4 గ్రామాల ప్రజలు రోడ్డు, కరంట్ సౌకర్యం లేదని ఎలక్షన్ బహిష్కరిస్తామని ఆ తీర్మానించారు.

కనీస వసతులు కల్పించలే ఎలక్షన్ బహిష్కరిస్తాం.. 4 గ్రామాల ప్రజల సంచలన నిర్ణయం
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని అడవిలో ఉన్న ఎంగ్లపూర్‌తో పాటు 4 గ్రామాల ప్రజలు రోడ్డు, కరంట్ సౌకర్యం లేదని ఎలక్షన్ బహిష్కరిస్తామని ఆ తీర్మానించారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులు కనబడతారన్నారు. ఎలక్షన్ సమయంలో వాగ్దానాలు చేస్తారని.. గెలిచిన తర్వాత ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్ళాలంటే రోడ్డు సౌకర్యం లేక కాలి నడకన వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి పోవాలంటే నానా ఇబ్బందులతో ఎడ్ల బండిపై పోవాల్సి వస్తుందన్నారు. వ్యవసాయానికి త్రీ ఫేస్ కరంట్ లేక ఇబ్బంది అవుతుందన్నారు.

ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఓట్లు వేసిన తరువాత నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి నాయకులు వద్దని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా్మని నరకము అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. 30న జరిగే ఎన్నికలను బహిష్కరిస్తామని రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపారు.

Next Story