- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడిస్తాం.. సర్కార్‌కు తెలంగాణ జాగృతి హెచ్చరిక
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా ఎటూ తేలకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా, రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి ఇవాళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా సంచలన ట్వీట్ చేసింది. బీసీలంటే అంత చులకనా..? ఏం చేస్తారులే అన్న పట్టింపులేని తనమా! అంటూ ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలకు హైకోర్టు పెట్టిన గడువు ముంచుకొస్తోందని బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తుంటే అందుకు సాకులు.. కొర్రీలు.. పెడుతూ దాట వేస్తున్నారని కామెంట్ చేశారు. ఏది ఏమైనా సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పెడతామని ఒకరు.. రిజర్వేషన్ల పెంపు తర్వాతే ఎన్నికలని మరొకరు, పూటకో ప్రకటనతో బీసీ బిడ్డలను వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం తీసుకోని పక్షంలో త్వరలోనే మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మరిన్ని ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి హెచ్చరించింది.






