- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) నుంచి గెలిచి కాంగ్రెస్ (Congress)లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు శాసనసభ స్పీకర్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హతపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ (Speaker) విచారణకు ఆటంకాలు కలిగించోద్దని కోర్టు కామెంట్ చేసింది. సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పిటిషనర్ వివేకానంద (MLA Vivekananda) సుప్రీం తీర్పుపై స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము స్వాగతిస్తున్నామని కామెంట్ చేశారు. ఇప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. కోర్టు చెప్పిన విధంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ రెడ్డి గౌరవించాలని వివేకానంద అన్నారు.






