- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR: ఇంకా రెండేళ్లు వేచి ఉండాలి.. సైకిల్ ట్రాక్‌పై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్‌ని నిర్మించిన సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో (Narsingi) హైదరాబాద్ నార్సింగి దగ్గర 23 కిలోమీటర్ల మేర సోలార్ సైకిల్ ట్రాక్ (solar-roofed cycle track)ని నిర్మించిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ నిర్మించిన ఈ సోలార్ సైకిల్ ట్రాక్ దేశంలోనే మొదటిది. దాదాపు రూ. 90 కోట్ల వ్యయంతో ఈ ట్రాక్‌ను నిర్మించారు. ఈ ట్రాక్‌ను ఎక్కువగా సెలవు రోజుల్లో, వీకెండ్స్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఒక సాయంత్రం సోలార్ రూఫ్డ్ సైకిల్ ట్రాక్‌పై పిల్లలు సైకిల్ తొక్కుతూ కనిపించడం నిజంగా చాలా ఆనందం కలిగించిందని తెలిపారు. ఈ ట్రాక్ సద్వినియోగం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సైకిల్ ట్రాక్‌ను 75 కిలోమీటర్లకు విస్తరించాలని మేము పెద్ద ప్రణాళికలు వేసుకున్నామని గుర్తుకు చేశారు. అయితే, విస్తరణ కోసం మనం ఇంకా రెండు సంవత్సరాలు వేచి ఉండాలని తెలిపారు. ఈ మేరకు ఆయన సైకిల్ ట్రాక్‌పై చిన్నారులు సైకిల్ తొక్కుతున్న ఫోటోలను షేర్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యుత్తమ నిర్మాణాల్లో ఇది ఒకటి, ప్రస్తుతం నిర్వహణ లోపం కన్పిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది.






