- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ కంటే రెండింతలు ధాన్యం కొనుగోలు చేశాం.. కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ కౌంటర్
కేటీఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏనాడైనా గుర్తుకొచ్చారా? సూటు బూటు వేసుకొని కార్పొరేట్లతో చట్టాపట్టాలు వేసుకొని, ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు చేస్తూ తిరిగేవారు అంటూ ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు కేటీఆర్‌కు గురువారం బహిరంగ లేఖ రాశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏనాడైనా గుర్తుకొచ్చారా? సూటు బూటు వేసుకొని కార్పొరేట్లతో చట్టాపట్టాలు వేసుకొని, ఫైవ్ స్టార్ హోటళ్లలో జల్సాలు చేస్తూ తిరిగేవారు అంటూ ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు కేటీఆర్ కు గురువారం బహిరంగ లేఖ రాశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా రైతు సమస్యల గురించి మీరు మాట్లాడారా? చర్చించారా? సమీక్ష చేశారా? అధికారం దూరమవడంతో మీకు సాధారణ ప్రజలు గుర్తుకొస్తున్నారని అని, అధికారంలో ఉన్నప్పుడు మీ జీవితం మొత్తం కార్పొరేట్ స్టైల్‌లో నడిచిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు, మక్కలను శరవేగంగా కొనుగోలు చేస్తోందని, కలెక్టర్లు ప్రతిరోజూ ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షణ చేస్తున్నారన్నారన్నారు. మే 20, 2026 నాటికి రాష్ట్రంలో 45.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని, ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని చింతకుంట విజయరమణా రావు చెప్పారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.7,508 కోట్లు చెల్లింపులు జరిగాయని, 6.3 లక్షల మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి డబ్బులు జమ చేశామన్నారు.
12 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు, 33 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేశామని, 13,100 వాహనాలను ధాన్యం రవాణాకు ఉపయోగిస్తున్నామని, 2021-22లో 6,609 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, మా ప్రభుత్వం ఇప్పుడు 8,575 కేంద్రాలు ఏర్పాటు చేసిందని విజయరమణారావు చెప్పారు. 2021-22 రబీలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 21.79 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, తాము 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం 15 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని, ప్రతి రోజూ సగటున 50,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేస్తున్నామని విజయరమణారావు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని, వాహనాలు, హమాలీలు, గన్నీ బ్యాగులు, గోదాములలో నిల్వ స్థలం ఉండేలా చూస్తున్నామని, వాహనాలు, లాజిస్టిక్స్ అందించడంలో విఫలమయ్యే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వివరించారు.
336 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 11,54,469 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశామని, ఇప్పటికే గోదాములకు 9,53,050 మెట్రిక్ టన్నుల మక్కలను తరలించిచామని, 2,42,43,992 గన్న బ్యాగులను సరఫరా చేశామని విజయరమణారావు చెప్పారు. మీ ప్రభుత్వ హయాంలో మక్కలు కొనుగోలు చేయకుండా ఎగనామం పెడితే రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారని, రోజుల తరబడి వేచి ఉండి ధాన్యం కుప్పలపైనే రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కేటీఆర్ శవ రాజకీయాలు చేయటం మానుకోవాలని, మీ హయాంలో ధాన్యం కొనుగోలు ఎంత చేశారు? ఇప్పుడు ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నారో తెలుసుకోవాలని విజయరమణారావు హితవు పలికారు.






