పనికిమాలిన దేశాలకు సమాధానం చెప్పాల్సిందే..! ఉగ్రదాడిపై మంత్రి కొండా సురేఖ ఫైర్

by Ramesh Goud |

పనికిమాలిక దేశాలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మండిపడ్డారు.

పనికిమాలిన దేశాలకు సమాధానం చెప్పాల్సిందే..! ఉగ్రదాడిపై మంత్రి కొండా సురేఖ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: పనికిమాలిక దేశాలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె.. పహాల్గమ్ సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఈ ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే పనికిమాలిన దేశాలు చేసే హేయమైన చర్యలకు సమాధానం చెప్పాల్సిన సమయం ఇది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రతి భారతీయుడూ నడుం కట్టి, దేశ రక్షణ కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేగాక నిన్న ఒక మాజీ సైనికుడు “దేశం పిలిస్తే మేము రెక్కలు కట్టుకొని వచ్చి ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం” అని చెప్పారని, ఇలాంటి యోధులకు మనమంతా అండగా ఉండి, పోరడాలని సూచించారు. ఇక దేశ భద్రతకోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా నిలబడాలి! అని మంత్రి పిలుపునిచ్చారు. కాగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది మృతి చెందగా.. అనేక మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఉగ్రవాదానికి వ్యతిరేఖంగా దేశం మొత్తం ఐక్యంగా ఉండాలని పలువురు పిలుపునిస్తున్నారు.

Next Story